శిక్షణా నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు పొందాలి

ABN , First Publish Date - 2022-11-15T23:59:00+05:30 IST

నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి శిక్షణ అందిం చి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ధ్యేయంతో ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని, శిక్షణా నైపుణ్యంతో మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు.

 శిక్షణా నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు పొందాలి

గజపతినగరం: నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి శిక్షణ అందిం చి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ధ్యేయంతో ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని, శిక్షణా నైపుణ్యంతో మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో 50మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ఏఐఎం స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఏఐఎం నాయు డుకు శిక్షణా బాధ్యతలు అప్పగించామని చెప్పారు. విద్యార్థుల శిక్షణకు అయ్యే ఖర్చు తానే భరిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల కోసం నిరుద్యోగ భృతితో పాటు ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వమే శిక్షణా తరగతులను నిర్వహించేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పథకాల రద్దుతో నిరుద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు ఈ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-11-15T23:59:00+05:30 IST

Read more