గాంధీ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2022-02-23T05:37:25+05:30 IST

కొమరాడ మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సో మవారం రాత్రి ధ్వంసం చేశారు.

గాంధీ విగ్రహం ధ్వంసం

కొమరాడ: కొమరాడ మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సో మవారం రాత్రి ధ్వంసం చేశారు. మం గళవారం ఉదయానికి స్థానికులు గుర్తించి విచారం వ్యక్తం చేశారు. ఘటనను గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు బత్తిలి శ్రీను అక్కడకు వెళ్లి పరిశీలించారు. అనంతరం వెంటనే విగ్రహ పునర్నిర్మాణ పనులు చేయించారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.


Read more