అశోక్‌ హయాంలోనే జాతీయ రహదారికి నిధులు

ABN , First Publish Date - 2022-12-13T23:59:14+05:30 IST

విజయనగరం మండలంలోని చెల్లూరు వద్ద జాతీ య రహదారిని టీడీపీ విజయనగరం నియోజకవర్గ నేతలు మంగళవారం పరిశీ లించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు ఐవీపీ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయ కులు, కార్యకర్తలు ఆ రోడ్డుపై ర్యాలీగా వెళ్లారు

 అశోక్‌ హయాంలోనే జాతీయ రహదారికి నిధులు

విజయనగరం రూరల్‌: విజయనగరం మండలంలోని చెల్లూరు వద్ద జాతీ య రహదారిని టీడీపీ విజయనగరం నియోజకవర్గ నేతలు మంగళవారం పరిశీ లించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు ఐవీపీ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయ కులు, కార్యకర్తలు ఆ రోడ్డుపై ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఐవీపీ రాజు మాట్లా డుతూ కేంద్రమంత్రిగా అశోక్‌ గజపతిరాజు బాధ్యతలు నిర్వహించిన సమయంలో అప్పటి రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేశారన్నారు. చెల్లూరు నుంచి గొట్లాం వరకూ ఉన్న ఈ రింగురోడ్డు విస్తరణ వల్ల విజయనగరం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భారీ వాహనాలు విజ యనగరం రాకుండానే అంతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతగానో ఉప యోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కంది సాయి జగ్గారావు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, రాజేష్‌ వర్మ, చెల్లూరు టీడీ పీ నాయకులతో పాటు, నగర నాయకులు విజ్జపు ప్రసాద్‌, ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, కర్రోతు నర్సింగరావు, ఎం పైడిరాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంటా రవి, రాయపాటి సంతోష్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు బెవర భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:59:14+05:30 IST

Read more