అర్హులకు ఉచిత బియ్యం

ABN , First Publish Date - 2022-12-31T00:31:32+05:30 IST

నిబంధనల మేరకు అర్హత కలిగిన కార్డుదారులకు కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యాన్ని అందిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

అర్హులకు ఉచిత బియ్యం

గరుగుబిల్లి, డిసెంబరు 30 : నిబంధనల మేరకు అర్హత కలిగిన కార్డుదారులకు కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యాన్ని అందిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు. శుక్రవారం ఉల్లిభద్రలో పీఎంజీకేవైపై ఆరా తీశారు. ఉచిత బియ్యం ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయన్న దానిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు జిల్లాలో 94 శాతం మేర కార్డుదారులకు ఉచిత బియ్యం అందించినట్లు చెప్పారు. మొత్తంగా 2.75 లక్షల కార్డులు ఉండగా ప్రస్తుతం 2.60 లక్షల కార్డులకు గాను ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున రేషన్‌ డిపోల బియ్యం అందిస్తున్నట్లు వివరించారు. రేషన్‌ డిపోల్లో సక్రమంగా సరుకులు అందకుంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట పార్వతీపురం పౌర సరఫరాల ఉప తహసీల్దార్‌ హెచ్‌.రమణారావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:31:33+05:30 IST