ఆహారం కలుషితమై..

ABN , First Publish Date - 2022-04-05T06:05:13+05:30 IST

రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం కలుషిత ఆహారం తిని.. ఓ వంట మనిషి మృతి చెందింది.

ఆహారం కలుషితమై..

 వంట మనిషి మృతి  

 రేగిడి ఆశ్రమ పాఠశాలలో ఘటన

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 4: రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం కలుషిత ఆహారం తిని.. ఓ వంట మనిషి మృతి చెందింది. ఎల్విన్‌పేట ఎస్‌ఐ షణ్ముఖరావు కథనం ప్రకారం... ఆశ్రమ పాఠశాలలో వంట మనుషులు మధ్యాహ్నం నాటుకోడి మాంసంతో భోజనం చేశారు. కొద్దిసేపటి తర్వాత వారికి వాంతులయ్యాయి. వెంట నే కురుపాం సీహెచ్‌సీలో వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించా రు. పరిస్థితి విషమించడంతో వంట మనిషి నిమ్మక సాలమ్మ (45) మృతి చెందిం ది.  మరో ఇద్దరు నిమ్మక మంగమ్మ, ఆరిక శివలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశా రు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

 

Read more