నాగావళికి వరద

ABN , First Publish Date - 2022-09-09T03:57:11+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నాగావళి నదికి వరద తాకిడి నెలకొంది. తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో ఒక్కసారిగా పెరిగింది. నదికి ఆనుకొని గెడ్డల నుంచి కూడా పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రానికి 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

నాగావళికి వరద
తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతి

గరుగుబిల్లి, సెప్టెంబరు 8 : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నాగావళి నదికి వరద తాకిడి నెలకొంది. తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో ఒక్కసారిగా పెరిగింది. నదికి ఆనుకొని గెడ్డల నుంచి కూడా పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రానికి 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా స్పిల్‌వే గేట్లు ఎత్తి 4,200 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. వర్షాలతో ఇన్‌ఫ్లో పెరిగిందని.. మరింత వరద పెరిగే అవకాశముందని ప్రాజెక్టు డీఈ బి.శ్రీహరి, జేఈ కె.శ్రీనివాసరావులు తెలిపారు. అటు సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు చెప్పారు.


Read more