సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి

ABN , First Publish Date - 2022-09-11T05:41:12+05:30 IST

ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ ఒ.దిలీప్‌కుమార్‌ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా శనివారం జిల్లా కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి
మాట్లాడుతున్న ఏఎస్పీ

  ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 10 : ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ ఒ.దిలీప్‌కుమార్‌ సూచించారు.  ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా శనివారం జిల్లా కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న చిన్న కారణాలతో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడరాదని  ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌ తెలిపారు. విలువైన జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు.  మానసిక వేదనకు గురైన వారికి కుటుంబ సభ్యులు అండగా ఉండాలని సూచించారు.  కార్యక్రమంలో డీఎస్పీ ఎ.సుభాష్‌, ఎస్‌బీఐ సీఐ ఎస్‌.శ్రీనివాసరావు, సీఐ విజయానంద్‌, ఎస్‌ఐలు ఫకృద్దీన్‌, వై.సింహాచలం, దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more