మాజీ సైనికుల నిరసన

ABN , First Publish Date - 2022-11-07T23:46:59+05:30 IST

విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట మాజీ సైనికులు సోమవారం నిరసన తెలిపారు.

 మాజీ సైనికుల నిరసన

కలెక్టరేట్‌: విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట మాజీ సైనికులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వర రావు మాట్లాడుతూ పట్టణం లోని గాజులురేగ సమీపం లోని సర్వే నెంబరు 1లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాలు కోసం పదేళ్ల కిందట స్థలం కేటా యించారని తెలిపారు. సబ్‌డివిజన్‌ చేయకపోవడంతో బ్యాంకు రుణాలు మంజూరు కావడంలేదని వాపోయారు. సబ్‌ డివిజన్‌ చేయాలని పలుసార్లు కోరినా ఫలితం లేకుండాపోయిందని తెలిపారు.

Updated Date - 2022-11-07T23:46:59+05:30 IST

Read more