పరిసరాలను శుభ్రంగా ఉంచాలి: పీవో

ABN , First Publish Date - 2022-11-21T00:33:29+05:30 IST

పరిసరాలు పరిశుభ్రంగా ఉం చాలని ఐటీడీఏ పీవో బి.నవ్య, ఎమ్మెల్యే కళావతి తెలిపారు.

 పరిసరాలను శుభ్రంగా ఉంచాలి: పీవో

సీతంపేట: పరిసరాలు పరిశుభ్రంగా ఉం చాలని ఐటీడీఏ పీవో బి.నవ్య, ఎమ్మెల్యే కళావతి తెలిపారు. ఆదివారం సీతంపేటలో స్వచ్ఛత క్యాంపెయిన్‌ డే కార్యక్రమాన్ని జన జాతీయ గౌరవ దినోత్సవాల్లో భాగంగా నిర్వ హించారు. తొలుత పీఆర్‌సీ భవనం వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం ప్రభు త్వాసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి, సీతంపేట ప్రధాన కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీవో రోసిరెడ్డి, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జి.మురళి, ఎంపీపీ బిడ్డిక ఆదినారాయణ, డీడీ నగేష్‌, ఎంపీడీవో గీతాంజలి, వెలుగు ఏపీడీ నారాయణరావు, సూపరింటెండెంట్‌ దేశ్‌, గురుకులం సెల్‌ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:33:29+05:30 IST

Read more