మొండెంఖల్‌లో కలకలం!

ABN , First Publish Date - 2022-01-04T05:14:54+05:30 IST

మొండెంఖల్‌లో పసికందు మృతదేహం కలకలం సృష్టించింది. గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో సోమవారం రెండు నెలల వయసు ఉండే పసికందు మృతదేహం స్థానికులకు కనిపించింది.

మొండెంఖల్‌లో కలకలం!

 వెలుగుచూసిన పసికందు మృతదేహం

కురుపాం రూరల్‌: మొండెంఖల్‌లో పసికందు మృతదేహం కలకలం సృష్టించింది. గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో సోమవారం రెండు నెలల వయసు ఉండే పసికందు మృతదేహం స్థానికులకు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో నీలకంఠాపురం ఎస్‌ఐ నారాయణరావు ఘటనా స్థలా నికి చేరుకున్నారు. ఘటనపై ఆరాతీశారు. శిశువు మృతదేహాన్ని ఎవరైనా పడేశా రా? లేకపోతే శ్మశానవాటిక నుంచి కుక్కలు ఈడ్చుకొని తెచ్చాయా? అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కురుపాం ఆస్పత్రి కి తరలించారు. 

 

Read more