మేనకోటలో ఏనుగులు

ABN , First Publish Date - 2022-09-11T05:40:27+05:30 IST

చిన్నపల్లంకి పంచాయతీ పరిధిలో ఉన్న మేనకోట రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గత వారం రోజులుగా రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

మేనకోటలో ఏనుగులు
మేనకోట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు

సీతంపేట:  చిన్నపల్లంకి పంచాయతీ పరిధిలో ఉన్న మేనకోట రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గత వారం రోజులుగా రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు  అటవీశాఖ సిబ్బంది తెలిపారు.  ఈ  ప్రాంతానికి ఫోన్‌ సౌకర్యం లేదు. ప్రస్తుతం జీపీఎస్‌ విధానం ద్వారా గజరాజుల కదిలికలను వారు తెలుసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల వైపు ప్రజలు  తిరగరాదని  గ్రామాలకు సమాచారం వేస్తున్నారు.  కేర్‌ టేకర్స్‌  కూడా గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు.  ఈ ప్రాంతంలో ఆహారం, నీరు  పుష్కలంగా ఉండడంతో  కొద్దిరోజులుగా ఏనుగులు ఇక్కడ సంచరిస్తున్నట్లు సంబంఽధిత అధికారులు తెలియజేస్తున్నారు. Read more