నేటి నుంచి విద్యుత్‌ వారోత్సవాలు

ABN , First Publish Date - 2022-12-13T23:58:22+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులు ఒక యూనిట్‌ ఆదాతో రెండు యూనిట్ల ఉత్పత్తి చేసినట్టేనని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు అన్నారు.

నేటి నుంచి విద్యుత్‌ వారోత్సవాలు

విజయనగరం దాసన్నపేట: విద్యుత్‌ వినియోగదారులు ఒక యూనిట్‌ ఆదాతో రెండు యూనిట్ల ఉత్పత్తి చేసినట్టేనని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 20 వరకూ జాతీయ విద్యుత్‌ పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ వారోత్స వాల్లో భాగంగా బుధవారం కలెక్టర్‌ సూర్యకుమారి ఈ ర్యాలీని కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. ర్యాలీగా కలెక్టరేట్‌ నుంచి అంబేడ్కర్‌ కూడలికి చేరుకుని, మానవహారం చేపడతామని, ఈ ర్యాలీలో 300 మంది విద్యుత్‌ ఉద్యోగులు హాజరుకానున్నార న్నారు. 15న విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలు, 16న జేఎన్‌టీయూలో అవగాహన సదస్సు, 17న హైస్కూ ల్‌లో వ్యాసరచన, వృక్తత్త్వ పోటీలు జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 18న హోర్డింగులు, కరపత్రాల పంపిణీ, 19న జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్‌లలో అవగాహన సదస్సులు, 20న విద్యుత్‌ భవన్‌లో ముగింపు ఉత్సవాలు నిర్వహించి కలెక్టరు చేతుల మీదుగా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో విద్యుత్‌శాఖ అధికారులు సత్యనారాయణ, డీవీ రమణ, ఈశ్వరరావు, భాస్కరరా వు, ధర్మరాజు, ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఫ బొబ్బిలి: ఈ నెల 14 నుంచి 20 వరకు జాతీయ విద్యుత్‌ పొదుపు వారోత్సవాలను నిర్వహించంచనున్నట్లు ఎల క్ర్టికల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు పూడి హరి తెలిపారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 14 న విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో ఉద్యోగులతో ప్రతిజ్ఞ, 15న డివిజన్‌ కేంద్రంలో విద్యుత్‌ పొదు, ప్రాముఖ్యంపై విద్యా ర్థులకు చిత్రలేఖనం పోటీలు, 17న వ్యాసరచన పోటీలు, 20 వరకు అవగాహనా కార్య క్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పలు పోటీలలో విజేతలకు ఈ నెల 20 న జిల్లా కలెక్టరు చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-13T23:58:24+05:30 IST