చినుకు.. వణుకు!

ABN , First Publish Date - 2022-11-25T00:18:49+05:30 IST

రైతు గుండెల్లో వణుకు ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. చినుకులు ప్రారంభమయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆకాశంలో మబ్బులు ఉన్నా.. గురువారం ఉదయం నుంచి మాత్రం ఆకాశం మేఘావృతమైంది.

చినుకు.. వణుకు!
పొలంలో వరి కుప్పలు వేస్తున్న రైతులు

మారిన వాతావరణం.. రోజంతా మేఘావృతం

చిరుజల్లులతో ఆందోళనలో రైతులు

వరి పంటను కాపాడుకునేందుకు పాట్లు

పత్తి రైతులదీ అదే పరిస్థితి

(పాలకొండ/భామిని)

రైతు గుండెల్లో వణుకు ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. చినుకులు ప్రారంభమయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆకాశంలో మబ్బులు ఉన్నా.. గురువారం ఉదయం నుంచి మాత్రం ఆకాశం మేఘావృతమైంది. తుపాను వాతావరణాన్ని తలపించింది. అందుకు తగ్గట్టుగానే చిరుజల్లులు పడడంతో రైతులు పొలం బాట పట్టారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చాలా మండలాల్లో తుది దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో తుపాను ఛాయలు కనిపిస్తుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేదు. పంట చేతికందుతుందనగా ప్రకృతి విలయం ఎక్కడ తన్నుకుపోతుందోనన్న బెంగా వెంటాడుతోంది. జిల్లాలో ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉంది. 75 వేల హెక్టారుల్లో పంట సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేసినా రైతులు వ్యయప్రయాసలకోర్చి ఉబాలు పూర్తిచేశారు. మధ్యలో తుపాన్లతో భారీ వర్షాలు పడడంతో చీడపీడలు అలుముకున్నాయి. దీంతో రైతులు రసాయనాలు, ఎరువులు వాడాల్సి వచ్చింది. సస్యరక్షణ రూపంలో అదనపు భారం పడింది. పోనీ ఎలాగోలా పంటను పండించిన తరుణంలో ఇప్పుడు అల్పపీ

Updated Date - 2022-11-25T00:18:49+05:30 IST

Read more