న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-06-11T05:47:39+05:30 IST

కోర్టులో కేసు నడుస్తుం డగా తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, తనకు న్యాయం చేయాలని మొదటి భార్య, తన కుటుంబ సభ్యులతో శుక్రవారం నిరసన చేపట్టిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది.

న్యాయం చేయండి

  పెళ్లి మండపం వద్ద మొదటి భార్య నిరసన

  ఐద్వా, పోలీసుల చొరవతో ప్రశాంతం

పార్వతీపురం-ఆంధ్రజ్యోతి/ పార్వతీపురంటౌన్‌: కోర్టులో కేసు నడుస్తుం డగా తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, తనకు న్యాయం చేయాలని మొదటి భార్య, తన కుటుంబ సభ్యులతో శుక్రవారం నిరసన చేపట్టిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పట్టణ ఎస్‌ఐ కళాధర్‌ తెలిపిన వివరా ల మేరకు... ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన హబీబుల్లాతో కాకినాడ బ్యాంకు పేటకు చెందిన మహిళకు 2016లో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019 నుంచి విడిగా ఉంటున్నారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో హబీబుల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ యువతితో రెండో వివాహాన్ని స్థానిక ఓ కల్యాణ మండపంలో శుక్రవారం చేసుకునేందుకు సన్నద్ధమ య్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె, తన కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకులు, ఐద్వా సంఘ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవితో కలిసి కల్యాణ వేదిక వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కోర్టు తీర్పు రాకుండా రెండో వివాహం ఎలా చేసుకుంటాడని మండిపడ్డారు. సమాచారం అందుకున్న సీఐ విజయానంద్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలు చర్చించుకో వాలని సూచించారు. చివరకు రూ.4 లక్షలు పరిహారం ఇచ్చేందుకు, కేసు వాపస్‌ తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 15న డబ్బులు చెల్లించేలా అంగీకారం తెలపడంతో హబీబుల్లా రెండో వివాహం సుఖాంతమైంది. కార్యక్రమం లో సీపీఎం నాయకులు గొర్లి వెంకటరమణ, బి.సూరిబాబు, ఎస్‌.ఉమామహేశ్వర రావు, జి.తులసి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T05:47:39+05:30 IST