జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు జిల్లా ప్రాజెక్ట్‌

ABN , First Publish Date - 2022-12-12T23:59:20+05:30 IST

జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు పార్వతీపురం మన్యం జిల్లా ప్రాజెక్ట్‌ ఎంపికైంది. ఈ నెల 10, 11 తేదీల్లో తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టులను ప్రదర్శించారు. 26 జిల్లాల నుంచి 182 ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొనగా... జాతీయ స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు 17 ప్రాజెక్టులు అర్హత సాధించాయి.

జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు జిల్లా ప్రాజెక్ట్‌
విద్యార్థి కేశవనాయుడును అభినందిస్తున్న జేసీ ఆనంద్‌

జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు జిల్లా ప్రాజెక్ట్‌

విద్యార్థి కేశవనాయుడుకు అభినందనల వెల్లువ

పార్వతీపురం-ఆంధ్రజ్యోతి, డిసెంబరు 12 : జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు పార్వతీపురం మన్యం జిల్లా ప్రాజెక్ట్‌ ఎంపికైంది. ఈ నెల 10, 11 తేదీల్లో తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టులను ప్రదర్శించారు. 26 జిల్లాల నుంచి 182 ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొనగా... జాతీయ స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు 17 ప్రాజెక్టులు అర్హత సాధించాయి. ఇందులో జియ్యమ్మవలస మండలం బీజే పురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బి.కేశవనాయుడు తయారుచేసిన వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువుల తయారీ ప్రాజెక్ట్‌ ఎంపికైంది. మంత్రి రోజా చేతులమీదుగా కేశవనాయుడు ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థి కేశవనాయుడుతో పాటు ఉపాధ్యాయులు సోమవారం జేసీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జేసీ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌, డీఈవో ఎస్‌డీబీవీ రవణ, డిప్యూటీ డీఈవో ఆర్‌.విజయకుమారి తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు.

1111111111111111111111111111

Updated Date - 2022-12-12T23:59:20+05:30 IST

Read more