సద్దుమణిగిన వివాదం..!

ABN , First Publish Date - 2022-07-06T05:26:53+05:30 IST

ఎస్‌.కోటలో అక్రమంగా నిర్మించిన షెడ్‌పై నెల రోజులుగా నలుగుతున్న వివాదం సద్దుమణిగింది. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీని కలిపి నిర్మించిన ఆ షెడ్‌ను తొలగించేందుకు మంగళవారం సాయంత్రం సర్పంచ్‌ ఆధ్వర్యంలో సామగ్రిని ఖాళీ చేశారు.

సద్దుమణిగిన వివాదం..!
షెడ్‌లోని సామగ్రిని తరలిస్తున్న దృశ్యం


షెడ్‌ను తొలగించనున్న ఎస్‌.కోట పంచాయతీ
ఎవరి పంతం నెగ్గిందోనని స్థానికంగా చర్చ
శృంగవరపుకోట, జూలై 5:

ఎస్‌.కోటలో అక్రమంగా నిర్మించిన షెడ్‌పై నెల రోజులుగా నలుగుతున్న వివాదం సద్దుమణిగింది. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీని కలిపి నిర్మించిన ఆ షెడ్‌ను తొలగించేందుకు మంగళవారం సాయంత్రం సర్పంచ్‌ ఆధ్వర్యంలో సామగ్రిని ఖాళీ చేశారు. రెవెన్యూ అధికారులకు ఇచ్చిన మాట ప్రకారం షెడ్‌ను తొలగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. షెడ్‌ను తొలగించాలని ఓ ప్రజాప్రతినిధి, కూల్చొద్దని మరో ప్రజాప్రతినిధి గతంలో పట్టుబట్టడంతో ఎవరి పంతం నెగ్గిందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. కాగా మంగళవారం ఉదయమే జిల్లా ఉన్నతాధికారుల నుంచి రెవెన్యూ అధికారులకు షెడ్‌ తొలగింపునకు ఫోన్‌లో ఆదేశం వచ్చింది. ఆ మేరకే రెవెన్యూ అధికారులు పంచాయతీకి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆపేందుకు ఓ ప్రజా ప్రతినిధి తీవ్రంగా జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు వారు ససేమిరా అనడంతో తప్పని పరిస్థితిలో తొలగించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఎవరికి వారే పంతంతో ఉండడంతో జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆక్రమించి నిర్మించిన షెడ్‌ కావడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన అధినాయకత్వం తెలివిగా వ్యవహరించింది.


Updated Date - 2022-07-06T05:26:53+05:30 IST