రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2022-10-09T05:12:11+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన
ర్యాలీలో పాల్గొన్న టీడీపీ నాయకులు

- బాదుడే బాదుడులో టీడీపీ నాయకులు

పార్వతీపురం/టౌన్‌: రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. శనివారం పట్టణంలోని 24వ వార్డులో బాదుడే-బాదుడే కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఇంటింటా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, మహారాజ ఆస్పత్రి పేర్లు మార్చడమే తప్ప.. వాటిని అభివృద్ధి మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులు దారుణంగా ఉన్నాయన్నారు. అమరావతి రైతుల శాంతియుత పాదయాత్రను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని పదేళ్లు వెనక్కి పంపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కు తుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి, పట్టణ టీడీపీ అధ్యక్షులు జి.రవికుమార్‌, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు పి.రాజశేఖర్‌, నాయకులు కె.వెంకటరావు, జి.ఉదయభాను, జి.వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, ఎస్‌.భాస్కరరావు, బి.దేవిచంద్రమౌళీ, కౌన్సిలర్లు బి.గౌరునాయుడు, టి.వెంకటరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Read more