గిరిజనుల నిరసన

ABN , First Publish Date - 2022-09-14T05:21:06+05:30 IST

ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

గిరిజనుల నిరసన
పార్వతీపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గిరిజనులు

  పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌

 జిల్లకేంద్రంలో భారీగా ర్యాలీ, ధర్నా

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 13 : ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గిరిజనులకు పట్టాలిచ్చి భూములు ఇవ్వడం మరిచారని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించాలని తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలు గ్రామాల గిరిజనులు, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


Read more