సంస్కృత కళాశాలలో డిగ్రీ కోర్సులు

ABN , First Publish Date - 2022-07-19T04:50:54+05:30 IST

మహరాజా ప్రభుత్వ సాంస్కృత కళాశాలలో రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతవరకూ సంస్కృత కళాశాలలో 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకే తరగతులు ఉండేవి. డిగ్రీ కోర్సులను ఈ ఏడాది నుంచి ప్రవేశపెడుతున్నారు.

సంస్కృత కళాశాలలో డిగ్రీ కోర్సులు
మహరాజా ప్రభుత్వ సంస్కృతిక కళాశాల

ఈ ఏడాది నుంచి ప్రారంభం
విజయనగరం రూరల్‌, జూలై 18:
మహరాజా ప్రభుత్వ సాంస్కృత కళాశాలలో రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతవరకూ సంస్కృత కళాశాలలో 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకే తరగతులు ఉండేవి. డిగ్రీ కోర్సులను ఈ ఏడాది నుంచి ప్రవేశపెడుతున్నారు. దీంతో కళాశాల మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏళ్లుగా వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని అక్కడి విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎంసీసీ (మేథ్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్సు), ఎస్‌డీసీ (స్టాటస్టిక్స్‌, డేటాబేస్‌, కంప్యూటర్‌ సైన్సు) లను ఈ ఏడాది ప్రవేశపెట్టారు. ఈ రెండు కోర్సులకు ప్రవేశాల ప్రక్రియను కూడా ప్రారంభించారు. వచ్చే ఏడాది మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


Read more