ఒక్క రోజులో ఛేదించారు..

ABN , First Publish Date - 2022-02-20T05:25:17+05:30 IST

రావాడ డ్వాక్రా సభ్యుల సొమ్ము చోరీ కేసును భోగాపురం పోలీసులు ఒక్క రోజులో ఛేదించారు.

ఒక్క రోజులో ఛేదించారు..

  చోరీ కేసులో ఇద్దరు గర్భిణుల అరెస్టు

భోగాపురం: రావాడ డ్వాక్రా సభ్యుల సొమ్ము చోరీ కేసును భోగాపురం పోలీసులు ఒక్క రోజులో ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. రావాడ గ్రామంలో ఓ డ్వాక్రా  గ్రూపునకు రూ.2లక్షలు మంజూరు కాగా, గ్రూపు లీడర్‌ అవనాపు పార్వతి శుక్రవారం బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని, ఆటోలో తీసుకెళ్తుండగా, అందులో రూ.50వేలు చోరీకి గురయ్యాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మెంటాడ మండలం పిట్టాడకు చెందిన ఇద్దరు గర్భిణులు ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించా రు. అందులో ఒకరు మైనర్‌. వీరిద్దరూ శుక్రవారం మహారాజపేట సమీప ఐవోబీ బ్యాంకు ఆవరణలో ఉండి ఏవరైనా బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్తున్నారా అని గమనిస్తూ ఉన్నారు. అదే సమయంలో రావాడ గ్రామానికి చెందిన పార్వతి ఒక్కరే బ్యాగులో నగదు తీసుకొని ఆటో ఎక్కడం గమనించి, అదే ఆటోలో ఇద్దరూ ఎక్కా రు. గర్భిణీ అయిన రమణి.. పార్వతీ పక్క సీట్లో కూర్చోగా, మరో మైనర్‌ గర్భిణీ చంటి పిల్లాడును ఎత్తుకొని ఎదురు సీట్లో కూర్చుంది. మైనర్‌ గర్భిణీ పార్వతీని మాటల్లో పెట్టి బ్యాగులో ఉన్న రూ.50వేలు దొంగిలించింది. సవరవల్లి జంక్షన్‌లో ఇద్దరూ దిగిపోయారు. మరో చోరీ చేసే ప్రయత్నంలో ఇద్దరు గర్భిణులు అక్కివరం జంక్షన్‌ సమీపంలో శనివారం అనుమానంగా తిరుగుతుండడంతో వారిని పోలీసు లు గుర్తించి విచారించారు. రూ.50వేలు చోరీకి పాల్పడింది వీరిద్దరే అని అంగీక రించారు. వీరి నుంచి రూ.49వేలు రికవరీ చేశారు. వీరిని అరె స్టు చేసి రిమాం డుకు తరలిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  

 

Read more