శతశాతం సర్వే పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-11-03T00:02:30+05:30 IST

రీసర్వేను శతశాతం పూర్తి చేయాలని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆదేశించారు.

శతశాతం సర్వే పూర్తి చేయండి

భామిని: రీసర్వేను శతశాతం పూర్తి చేయాలని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆదేశించారు. బుధవారం రీసర్వేపూర్తయిన బత్తిలి, వడ్డంగి, బొమ్మిక గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే పూర్తిచేసిన భూముల రైతుల ఫొటో లు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.బత్తిలి, వడ్డంగిలో పలువురి రైతుల ఫొటోలు నమోదు కాకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. కాగా బత్తిలిలో కొంతమంది రైతులు తమ భూములు గ్రామకంఠంలో నమోదుకావడంతో సరిచేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అప్పారావు, మండల సర్వేయర్‌ తోట రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T00:03:11+05:30 IST
Read more