పూర్తి స్థాయిలో సర్వే చేయాలి

ABN , First Publish Date - 2022-11-23T00:12:10+05:30 IST

పోలవరం ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని రైతులు కోరారు. మంగళవారం కల్లేపల్లి గ్రామంలో పోల వరం రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన రెవెన్యూ సిబ్బంది జరిగిన తప్పుల పై స్పందించారు.

పూర్తి స్థాయిలో సర్వే చేయాలి

లక్కవరపుకోట: పోలవరం ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని రైతులు కోరారు. మంగళవారం కల్లేపల్లి గ్రామంలో పోల వరం రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన రెవెన్యూ సిబ్బంది జరిగిన తప్పుల పై స్పందించారు. నోటిఫికేషన్‌కి ముందు జరిగిన ఫీల్డ్‌ సర్వేలో తీసుకున్న కొంత మంది రైతుల పేర్లు, కొన్ని సర్వే నెంబర్లు గతనెలలో వెలువడిన పత్రికా ప్రకటన లో రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై తహసీల్దార్‌ ను వివరణ కోరగా వెంటనే అభ్యంతరాలు స్వీకరించాలని కింది స్థాయి అధికారుల ను ఆదేశించారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 18న ‘పోలవరం రైతులు ఆందోళన చెందక్కర్లేదు’ అనే కథనం వెలువడింది. దీంతో రెవెన్యూ సిబ్బంది మంగ ళవారం తహసీల్దార్‌ రామకృష్ణ ఆదేశాల మేరకు రైతుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇంకా కొంతమంది రైతులు అందుబాటులో లేకపోగా, ఏ సమయం లోనైనా వారి సమస్య రెవెన్యూ కార్యాలయంలో తెలుపచ్చుని, రైతుల ఫిర్యాదులు, సమస్యలు జిల్లా అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని తహసీ ల్దార్‌ తెలిపారు. వీఆ ర్వో మోహన్‌, సర్వేయర్లు, పోలవరం అథారిటీ ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.

Updated Date - 2022-11-23T00:12:10+05:30 IST

Read more