-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Collectorate rioted with dharnas-NGTS-AndhraPradesh
-
ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్
ABN , First Publish Date - 2022-07-05T05:49:26+05:30 IST
ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్

పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సోమవారం ధర్నా లతో దద్దరిల్లింది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాలు డి మాండ్ చేశాయి. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టా యి. తమ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఎం నాయకులు జి.సన్యాసి రావు ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సవర భాషా వలం టీర్లు కుటుంబసభ్యులతో కలిసి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సవరభాషా వలంటీర్లను రెన్యువల్ చేయాలి
సీతంపేట: తమను రెన్యు వల్ చేయాలని ప్రాథమిక పాఠ శాలల్లో పనిచే స్తున్న సవర భాషా వలంటీ ర్లు సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మంగళవారం నుంచి పాఠశాలలు పున్రఃపారంభమవుతున్నా ఇంతవరకు రెన్యువల్‌పై సమాచారం ఇవ్వలేద న్నారు. అనంతరం ఐటీడీఏ ఇన్‌చార్జి పీడీ రోసిరెడ్డికి వినతిపత్రం అందజేశారు సీతంపేట ఎస్‌ఐ కిశోర్‌వర్మ, సిబ్బందితో బందోబస్తు నిర్వహిం చారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతిరావు, భాస్కరరావు, సవర డొంబురు పాల్గొన్నారు.