బాలల హక్కులను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2022-11-19T00:04:19+05:30 IST

బాలల హక్కులను పరిరక్షించాలని జనచేతన స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి బగాది శశిభూషణచౌదరి అన్నారు.

బాలల హక్కులను పరిరక్షించాలి
పాలకొండ రూరల్‌: పోస్టర్లను ప్రదర్శిస్తున్న దృశ్యం

పాలకొండ రూరల్‌: బాలల హక్కులను పరిరక్షించాలని జనచేతన స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి బగాది శశిభూషణచౌదరి అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు సందర్భంగా ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్య, బాలల చట్టాలు, బాల్య వివాహా లు, బాల కార్మికులు, విద్యాహక్కు, దిశ, బాలల న్యాయ చట్టం, గ్రామస్థాయి బాలల రక్షణ కమిటీలపై అవగాహన కల్పించారు. అనంతరం క్రాఫ్‌-ఏపీ ప్రోచైల్డ్‌ గ్రూప్‌ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, అధ్యాపకులు సురేష్‌, రోహిణీలత, విజయగౌరి, ప్రసాదరావు, ఫెసిలి టేటర్‌ ఎం.సరస్వతి, కళాశాల బాలికల తదితరులు పాల్గొన్నారు.

కఠినంగా బాలల చట్టాలు

గుర్ల: రాష్ట్రంలో బాలల కోసం రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు అన్నారు. శుక్రవారం గుర్ల మండల కేంద్రంలో గుర్ల, నెల్లిమర్ల మండలాలకు చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శులు, సంక్షేమ విద్యా సహాయకులతో ఆయన సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ జి.హిమబిందు, ఎంపీపీ పొట్నూరు ప్రమీల, జడ్పీటీసీ శీర అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:04:19+05:30 IST

Read more