22న రాజాంలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2022-12-12T00:00:23+05:30 IST

రాజాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈనెల 22న పర్యటిస్తారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ పిలుపునిచ్చారు.

22న రాజాంలో చంద్రబాబు పర్యటన

రాజాం: రాజాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈనెల 22న పర్యటిస్తారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ పిలుపునిచ్చారు. ఆది వారం మండలం రాజీపేట గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను తెలుసుకోవడానికి నేరుగా చంద్రబాబు వస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచడంతోపాటు ప్రతిపక్ష నాయకులపై దాడు లకు పాల్పడుతోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు విషయం లో జాప్యం చేస్తున్నారని తెలిపారు. సకాలంలో కొనుగోలుచేస్తే మాండస్‌ తుఫాన్‌ వల్ల రైతులు ఇబ్బందులు పడే అవకాశముండదని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేం ద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు జడ్డు విష్ణు మూర్తి, సర్పంచ్‌ రగుమండల గణపతి నాయు డు, సామంతుల త్రినాఽథరావు, నాయకులు గురవాన నారాయణరావు, బట్న శ్రీని వాసరావు, రౌతు వెంకటరమణ, పల్ల సత్యంనాయుడు, ఎస్‌.లక్ష్మణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:00:23+05:30 IST

Read more