బైకు ఢీకొని బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-01-29T05:25:52+05:30 IST

గుర్తుతెలియని బైకు ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన బాడంగి మండల కేంద్రంలోని స్వామి కల్యాణ మండపం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

బైకు ఢీకొని బాలుడి మృతి

బాడంగి, జనవరి 28: గుర్తుతెలియని బైకు ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన బాడంగి మండల కేంద్రంలోని స్వామి కల్యాణ మండపం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నరేష్‌  తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రా నికి చెందిన ఒమ్మి ఆర్యవర్థన్‌(12) అనే బాలుడు గురువారం సాయంత్రం ప్రైవేటుకు వెళ్లి, స్థానిక స్వామి కల్యాణ మండపం వద్ద తన తోటి స్నేహితులతో రోడ్డు దాటి వస్తుండగా.. బాడంగి నుంచి రామభద్రపురం వైపు వెళుతున్న గుర్తుతెలియని బైకు ఢీకొని వెళ్లిపోయింది. దీంతో ఆర్యవర్థన్‌ రోడ్డుపక్కనున్న పొదల్లోకి తుల్లిపో యాడు. చుట్టుపక్కలవారు వచ్చి స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. తలకు తీవ్ర గాయం అవ్వడంతో వైద్యులు ప్రథమ చికిత్సచేసి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి నాగభూషణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతుడికి తల్లి నిర్మల, తండ్రి నాగభూషణ, చెల్లి హైందవి ఉన్నారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

Read more