‘హుదా’కు ఉత్తమ సేవల అవార్డు

ABN , First Publish Date - 2022-11-11T23:57:09+05:30 IST

పట్టణానికి చెంది న హుదా ముస్లిం వెల్ఫేర్‌ అసో సియేషన్‌కు ఉత్తమ సేవల అ వార్డు దక్కింది.

‘హుదా’కు ఉత్తమ సేవల అవార్డు

బొబ్బిలి: పట్టణానికి చెంది న హుదా ముస్లిం వెల్ఫేర్‌ అసో సియేషన్‌కు ఉత్తమ సేవల అ వార్డు దక్కింది. జాతీయ మైనా రిటీ సంక్షేమ దినోత్సవాన్ని పుర స్కరించుకుని జిల్లా కలెక్టర్‌, మై నార్టీ సంక్షేమశాఖాధికారుల నుంచి హుదా అధ్యక్షుడు మహ్మ ద్‌ రఫీ శుక్రవారం ఈ అవార్డును విజయనగరంలో అందుకున్నారు. గత 13 సంవత్సరాలనుంచి ముస్లిం పేదలకు హుదా వినూత్న రీతిలో సహకారం అందిస్తోందని, పలువురు పేదలను వైద్య విద్యాకోర్సుల్లో కూడా చేర్పించి ఆదుకున్నామన్నారు. ముస్లిం పర్వదినాల్లో పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులతోపాటు వస్త్రదానం చేస్తున్నామని, తమ సంస్థలో గల ముస్లిం పెద్దలు అందిస్తున్న సహకారంతో ఈ గుర్తింపు లభించిందని రఫీ తెలిపారు. హుదాకు వరుసగా రెండో ఏడాది అవార్డు రావడంపై మునిసిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు రియాజ్‌ఖాన్‌, ఇంతియాజ్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-11T23:57:09+05:30 IST

Read more