అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2022-04-24T05:37:57+05:30 IST

జిల్లాలో (ఆదివారం నుంచి బుధవారం వరకు) నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ శనివారం తెలిపారు.

అప్రమత్తంగా ఉండండి

నాలుగు రోజులూ అధిక ఉష్ణోగ్రతలు

జాగ్రత్తలు తీసుకోవాలని  ఎస్‌డీఎంఏ సూచన

పార్వతీపురం, ఏప్రిల్‌ 23 : జిల్లాలో (ఆదివారం నుంచి బుధవారం వరకు)  నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  విపత్తుల నిర్వహణ సంస్థ  (ఎస్‌డీఎంఏ) డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ శనివారం తెలిపారు. ఐఎండీ సూచనల ప్రకారం వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. డీహైడ్రేట్‌ కాకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్‌, లస్సీ, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీరు, తదితర వాటిని తాగాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2022-04-24T05:37:57+05:30 IST