-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Ayyanna Patrudu fire on cm jagan anr-MRGS-AndhraPradesh
-
మంత్రి రోజా కూడా ఆ రోజు అమరావతికి సై అన్నారు: అయ్యన్న
ABN , First Publish Date - 2022-09-15T20:06:58+05:30 IST
స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అమరావతి రైతుల పట్ల మాట్లాడే తీరు తప్పు అని టీడీపీ నేత అయ్యన్న అన్నారు.

విజయనగరం: స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అమరావతి రైతుల పట్ల మాట్లాడే తీరు తప్పు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీదరి అప్పలరాజు (Appala raju) కూడా తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి రోజా (Roja) సైతం ఆ రోజు అమరావతి రాజధానికి సై అన్నారన్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకుంటామంటున్న మంత్రులకు బుద్ధుందా? అని ప్రశ్నించారు. జగన్ (Jagan) పాదయాత్రకు ఆనాడు టీడీపీ ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి గది తలుపులేసుకుంటున్న సీఎం జగన్ ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదని అయ్యన్న పాత్రుడు అన్నారు.