సీజ్‌ చేసిన వాహనాలకు వేలం

ABN , First Publish Date - 2022-11-25T00:24:00+05:30 IST

పోలీసు స్టేషన్ల పరిధిలో 102 సీఆర్‌పీసీ ప్రకారం సీజ్‌ చేసిన వాహనాలను నిబంధనల ప్రకారం వేలం వేయాలని ఎస్‌పీ దీపికాపాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో గురువారం మాసాంతర నేర సమీక్ష నిర్వహించారు.

సీజ్‌ చేసిన వాహనాలకు వేలం
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ దీపికాపాటిల్‌

ప్రమాదాల నియంత్రణకు చర్యలు

ఎస్పీ దీపికాపాటిల్‌

విజయనగరం క్రైం, నవంబరు 24: పోలీసు స్టేషన్ల పరిధిలో 102 సీఆర్‌పీసీ ప్రకారం సీజ్‌ చేసిన వాహనాలను నిబంధనల ప్రకారం వేలం వేయాలని ఎస్‌పీ దీపికాపాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో గురువారం మాసాంతర నేర సమీక్ష నిర్వహించారు. దర్యాప్తులో వున్న కేసుల సంఖ్యను తగ్గించాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. వెంటవెంటనే న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయాలన్నారు. న్యాయస్థానాల నుంచి సీసీ నెంబర్లను తీసుకోవాలని సూచించారు. అనధికార ఇసుక డంప్‌లు, పేకాట, కోడి పందాల స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదైన తొలి 10 పోలీసు స్టేషన్లలో ప్రమాదాలు జరిగేందుకు గల కారణాలపై ఆరా తీశారు. వాటి నియంత్రణకు వైట్‌ కలర్‌ పెయింట్‌తో చిహ్నాలను ఏర్పాటు చేయాలన్నారు.

- వివిధ పోలీసుస్టేషన్లలో సమర్థంగా విధులు నిర్వహించి.. లోక్‌అదాలత్‌లకు కేసులను పంపడంలో క్రియాశీలకంగా పనిచేసిన డెంకాడ ఎస్‌ఐ యు.మహేష్‌, మరో ఎస్‌ఐ అశోక్‌, బొబ్బిలి ఏఎస్‌ఐ భాస్కరరావు, కానిస్టేబుళ్లు పి.రామకృష్ణ, పి.అప్పారావులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీదేవిరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:24:00+05:30 IST

Read more