AP News.. ప్లాస్టిక్, ఫ్లెక్సీల నిషేధం ఎక్కడా కనిపించటం లేదు: అశోక్‌గజపతిరాజు

ABN , First Publish Date - 2022-08-28T19:54:27+05:30 IST

జగన్ రెడ్డి వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టాలని టీడీపీ నేత అశోక్ గజపతి రాజు అన్నారు.

AP News.. ప్లాస్టిక్, ఫ్లెక్సీల నిషేధం ఎక్కడా కనిపించటం లేదు: అశోక్‌గజపతిరాజు

విజయనగరం (Vizainagaram): మహారాజ కోట దగ్గర మట్టి గణపతి విగ్రహాలను టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapati Raju) దంపతులు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ జగన్ రెడ్డి (CM Jagan) వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టాలన్నారు. ప్లాస్టిక్ (Plastic), ఫ్లెక్సీ(flexi)ల నిషేదం ఎక్కడా కనిపించటం లేదని అన్నారు. రెండు వందలకుపైగా దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదని అశోక్ గజపతిరాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-08-28T19:54:27+05:30 IST