AP News: మరో రెండు నెలల్లో సీపీఎస్పై ప్రభుత్వం తుది నిర్ణయం: బొత్స

ABN , First Publish Date - 2022-09-10T22:18:56+05:30 IST

Vijayanagaram: ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ప్రభుత్వం తూతూమంత్రంగా వారితో చర్చలు జరుపుతూ కాలం నెట్టుకొస్తుంది. ఇప్పటికే పలుమార్లు జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరంలో మం

AP News: మరో రెండు నెలల్లో సీపీఎస్పై ప్రభుత్వం తుది నిర్ణయం: బొత్స

Vijayanagaram: ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ (CPS) రద్దు చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉద్యోగ సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం తూతూమంత్రంగా సంఘాల నాయకులతో చర్చలు జరుపుతూ కాలం నెట్టుకొస్తుంది. ఇప్పటికే పలుమార్లు జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana) ప్రభుత్వ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాట వాస్తవమేనని.. అయితే ఇప్పుడు పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో సీపీఎస్పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకునే పెన్షన్ విధానంపై సీఎం నిర్ణయం ఉంటుందన్నారు. కొద్దిరోజుల్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలవుతుందని, వచ్చే నెల నుంచి ఆర్టీసీ సిబ్బందికి కొత్తజీతాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-10T22:18:56+05:30 IST