విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రకటన చేయాలి

ABN , First Publish Date - 2022-11-12T00:07:35+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించమని ప్రధాని మోదీ ప్రకటించాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రకటన చేయాలి

పార్వతీపురంటౌన్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించమని ప్రధాని మోదీ ప్రకటించాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్వ తీపురంలో ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని స్టీల్‌ప్లాంట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఎందరో త్యాగ ధనుల పోరాట ఫలితంగా ఏర్పాటైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని చూడడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డి మాండ్‌ చేశారు.ప్రజా సంఘాల నాయకులు బి.నర్సింగరావు, ఆర్‌.వేణు, జి.సోమే శ్వరరావు, పి.సంగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:07:35+05:30 IST

Read more