అటవీ చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-11-15T23:52:15+05:30 IST

కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న అటవీ చట్టాల సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతుకూలీ సంఘం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌చేశారు.

అటవీ చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలి

కొమరాడ: కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న అటవీ చట్టాల సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతుకూలీ సంఘం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌చేశారు. మంగళవారం మండలంలోని పెదశాఖ, బట్టిమొగవలస, సర్వ పాడు గ్రామాల్లో బిర్సా ముండా జయంతి పురస్కరించుకొని రైతుకూలీ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కడ్రక వెంకటస్వామి, పలువురు ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడిదారుల చేతుల్లోకి భూములు

కురుపాం: కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) సవరణ చేసే ప్రతిపాదన వెనక్కు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం కురుపాంలో విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులకు వ్యతిరేకమైన చట్టాన్ని ప్రధాని ప్రధాని మోదీ తీసుకొస్తున్నారని తెలి పారు. దీంతో 1/70 చట్టం రద్దవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గిరిజనుల భూములన్ని కార్పొరేట్‌, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో మళ్ళీ గిరిజనులు వారిభూముల్లో కూలీలుగా మరిపోతారని తెలిపారు. అందువల్లే గిరిజనులు అటవీ హక్కుల చట్టం సవరణ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

Updated Date - 2022-11-15T23:52:24+05:30 IST

Read more