చెడు వ్యసనాలకు బానిసై చోరీలు

ABN , First Publish Date - 2022-11-30T23:54:13+05:30 IST

దుర్వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇళ్లల్లో దొంగత నాలకు పాల్పడుతుండడంతో పోలీ సులు పట్టుకున్నారు.

 చెడు వ్యసనాలకు బానిసై చోరీలు
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు:

విజయనరగరం క్రైమ్‌: దుర్వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇళ్లల్లో దొంగత నాలకు పాల్పడుతుండడంతో పోలీ సులు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ మోహనరావుతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు.వారి కథనం మేరకు.. చీపురుపల్లి మండలంలోని పత్తికాయపాలవలసకు చెందిన పొన్నాన రాంబాబు ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు అలబాటుపడ్డాడు. జిల్లాలోని ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర తులం బంగారం, విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు తులాల బంగారం చైన్‌, చెవి బుట్టలు, జామి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నల్ల పూసెలతాడు, రాజాం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర తులం బిస్కెట్‌ ముక్క, చెవి దుద్దులు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకుని దొంగతనాలకు పాల్పడి వచ్చిన డబ్బుతో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడేవాడు. చీపురుపల్లి ఎస్సై సన్యాసినాయుడు, సిబ్బంది తమకు వచ్చిన సమాచారం మేరకు పత్తికాయపాలవలస జంక్షన్‌ బస్టాప్‌ వద్ద రాంబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి దర్యాప్తుచేయగా దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు రాంబాబు నుంచి మొత్తం 12 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసును ఛేదించిన ఎస్సైలు సన్యాసినాయుడు, లోవరాజు, పీసీలు భానోజీరావు, జగదీష్‌, శైఖుంటరావు, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, వెంకటరమణలను డీఎస్పీలు శ్రీనివాసరావు, మోహనరావు అభినందించారు.

Updated Date - 2022-11-30T23:54:15+05:30 IST