ప్రమాదవశాత్తు వృక్తి మృతి

ABN , First Publish Date - 2022-11-15T23:56:09+05:30 IST

విశాఖ-అరకు రహదారిలోగల ఎల్‌.కోట జంక్షన్‌ సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందినట్టు ఎస్‌ఐ ముకుందరా వు తెలిపారు.

 ప్రమాదవశాత్తు వృక్తి మృతి

లక్కవరపుకోట: విశాఖ-అరకు రహదారిలోగల ఎల్‌.కోట జంక్షన్‌ సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందినట్టు ఎస్‌ఐ ముకుందరా వు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య అచ్చియ్యమ్మ, ఎస్‌ఐ తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా సబ్బవరం మండలం అసకపల్లి గ్రామానికి చెంది న కర్రి అప్పారావు(61) తన భార్య అచ్చియ్యమ్మతో కలిసి గత కొన్ని రోజుల కిందట తన కూతురు ఇంటికి ఎల్‌.కోట మండలం ఖాశాపేట వచ్చారు. అయితే అచ్చియ్య మ్మకు ఆరోగ్యం బాగోకపోవడంతో మంగళవారం అప్పారావు బైకుపై ఆమెను సబ్బవరం తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి వారు తిరిగి ఖాశాపేట బయలుదేరారు. అయితే అచ్చియ్యమ్మ ఆరోగ్యం బాగోకపోవడంతో బైకుపై కూర్చోలేకపోతున్నందున, కొత్తవలస వద్దకు బైకును ఆపారు. అప్పారావు తన భార్యను కొత్తవలస వద్ద బస్సు ఎక్కించి, ఖాశాపేట పంపించాడు. అక్కడి నుంచి ఆయన ఒక్కరే బైకుపై ఎల్‌.కోట వైపు వస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, ఎల్‌.కోట జంక్షన్‌ సమీ పంలో ఆయన మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-11-15T23:56:09+05:30 IST

Read more