ప్రగతి పనులు వేగవంతం

ABN , First Publish Date - 2022-05-24T05:32:37+05:30 IST

జిల్లాలో చేపడుతున్న ప్రగతి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. సోమవారం గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ, నాడు-నేడు, తదితర పనుల ప్రగతిపై మండల అధికారులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

ప్రగతి పనులు వేగవంతం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

  అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, మే 23 :
జిల్లాలో చేపడుతున్న ప్రగతి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. సోమవారం గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ, నాడు-నేడు, తదితర పనుల ప్రగతిపై మండల అధికారులతో   కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గృహ నిర్మాణాలు వేగవంతమయ్యేందుకు లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించకుండా ఉన్న 1169 గృహాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.  ఉపాధి పనుల్లో అధిక సంఖ్యలో వేతనదారులు పాల్గొనాలని, గరిష్ట వేతనం వచ్చే విధంగా కొలతలు తీయాలని సూచించారు.  గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.  అనంతరం జేసీ ఒ.ఆనంద్‌ మాట్లాడుతూ రీసర్వే డేటాను వెంటనే అప్‌లోడ్‌ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ భావ్న, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ కె.రామచంద్రరావు, గృహ నిర్మాణశాఖ పీడీ కె.కూర్మినాయుడు, ఈఈ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌,  జిల్లా పంచాయతీ అధికారి కిరణ్‌కుమార్‌, ఇన్‌చార్జి డీఈవో బ్రహ్మాజీరావు, గిరిజన సంక్షేమశాఖల ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
 

Read more