పకడ్బందీగా గ్రామ కంఠాల సర్వే: జేసీ

ABN , First Publish Date - 2022-11-11T23:43:26+05:30 IST

త్వరలో ప్రారంభం కానున్న గ్రామ కంఠాల సర్వే అత్యంత పక డ్బందీగా నిర్వహించాలని జేసీ మయూర్‌ అశోక్‌ కోరారు.

పకడ్బందీగా గ్రామ కంఠాల సర్వే: జేసీ

కలెక్టరేట్‌: త్వరలో ప్రారంభం కానున్న గ్రామ కంఠాల సర్వే అత్యంత పక డ్బందీగా నిర్వహించాలని జేసీ మయూర్‌ అశోక్‌ కోరారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో స్వామిత్ర పథకంపై ఆయా శాఖల సిబ్బందితో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేకుండా పారదర్శకంగా సర్వే జరగాలన్నారు. ఈ సర్వేపై ప్రతి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, వివాదాలు రేకెత్తే అవకాశం ఎక్కువగా ఉందని, సర్వే చేసిన సమయం లో ఆయా ఇంటి యజమానులు తప్పనిసరిగా అక్కడ ఉండేలా చూడాలన్నారు. దీని కోసం వారం రోజుల ముందుగానే సంబంధించిన యజమానికి నోటీసులు ఇ వ్వాలన్నారు. సర్వే పూర్తి చేసిన తరువాత వివిధ ప్రక్రియల అనంతరం, ఆస్తుల గు రించి ఖచ్చితమైన వివరాలతో కూడిన హక్కు పత్రాలను యజమానులకు పంపి ణీ చేయాలని, యజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చే యడం ద్వారా, వారికి ఆస్తు లపై శాశ్వత హక్కు కల్పించ డమే కాకుండా బ్యాంకుల నుంచి రుణాలను పొందేందు కు ఆర్థిక వనరుగా ఉపయోగ పడుతుందన్నారు. ఫారం 2 నోటీసు జారీ చేయడం, గ్రామ సభ నిర్వహించడం, ప్రచారం చేయడం, గ్రామ కంఠం సరిహద్దుల నిర్ణయం తదితర అంశాలపై వివరించారు. కేఆర్‌ఆర్‌సీ ఉప కలెక్టర్‌ సూర్యనారాయణ, డీపీవో నిర్మలాదేవి, సర్వేశాఖ ఏడి త్రివిక్రమరావు అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-11T23:43:26+05:30 IST

Read more