వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-24T05:46:28+05:30 IST

రంగారాయపురం గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యక్తి ఆత్మహత్య

లక్కవరపుకోట:  రంగారాయపురం గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై స్థానిక ఎస్‌ఐ ముకుందరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. విశాఖపట్టణం జిల్లా గాజువాక సింగసిరి కాలనీకి చెందిన కొయతాల నూక రాజు(38) అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆరు నెలలుగా రంగారా యపురంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈయన ఇక్కడ కూల్‌డ్రింక్స్‌ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. పని మీద బయటకు వెళ్లిన భార్య దేవి ఇంటికి వచ్చేసరికి, లోపలి వైపు తలుపు గడియ పెట్టిఉంది. స్థానికుల సహాయంతో తలుపు బద్దలుకొట్టి చూడగా, లోపల భర్త ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు. ఆసుప త్రికి తరలించేలోగా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి పోతు రాజు గాజువాక నుంచి రంగారాయపురం చేరుకుని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేద ని, దర్యాప్తు చేపట్టి, వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ చెప్పారు.

 

Read more