-
-
Home » Andhra Pradesh » Vizianagaram » A person commits suicide-MRGS-AndhraPradesh
-
వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-09T05:29:48+05:30 IST
రేజేరు గ్రామానికి చెందిన బొమ్మినాయని చిన్నంనాయుడు (70) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ ఆర్.జయంతి తెలిపారు.

బాడంగి: రేజేరు గ్రామానికి చెందిన బొమ్మినాయని చిన్నంనాయుడు (70) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ ఆర్.జయంతి తెలిపారు. వృద్ధాప్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 5వ తేదీ ఉదయం తన కల్లంలో పురుగు మందు తాగాడు. అదేరోజు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాజాం జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ చిన్నం నాయుడు గురువారం మధ్యాహ్నం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.