బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-03T06:15:29+05:30 IST

స్థానిక ఇందిరానగర్‌ కాలనీకి చెందిన అరసవల్లి రేణుక (23) అనే వివాహిత మంగళవారం వీధిలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

పాలకొండ: స్థానిక ఇందిరానగర్‌ కాలనీకి చెందిన అరసవల్లి రేణుక (23) అనే వివాహిత మంగళవారం వీధిలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బావిలో మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు, అగ్నిమా పక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి, మృతదేహాన్ని బయటకు తీశారు. రేణుక మృతిపై పోలీసులు భర్త శంకరరావును ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ సోమవారం రేణుక ఒంటిపై వేడి రసం పడడంతో చిన్న పిల్లలు ఉన్న ఇంటిలో జాగ్రత్తలు తీసుకోవాలని మందలించానని పోలీసులకు తెలిపారు. అంతే తప్ప తమ మధ్య మనస్పర్థలు లేవని వెల్లడించారు. రేణుక తండ్రి ఉమా మహేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రేణుక, శంకరరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

 

Read more