మద్దతు ధరపై నిలదీత

ABN , First Publish Date - 2022-11-24T00:11:18+05:30 IST

ధాన్యానికి మద్దతు ధరపై సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. బుధవారం సంతకవిటిలో ఎంపీపీ సిరిపురపు మంజు అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు, స ర్పంచ్‌లు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంపై ప్రశ్నించారు.

 మద్దతు ధరపై నిలదీత

సంతకవిటి: ధాన్యానికి మద్దతు ధరపై సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. బుధవారం సంతకవిటిలో ఎంపీపీ సిరిపురపు మంజు అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు, స ర్పంచ్‌లు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంపై ప్రశ్నించారు. గత ఏడాది రైతు లు పండించిన ధాన్యం మద్దతు ధర తెలియక రైతులకు అవస్థలు తప్పలేదని నిల దీశారు. తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల 25 శాతం ధాన్యం పాడైపోయినా మిల్లర్లు, వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేశారని, ఈ ఏడాది అదే పరిస్థితి నెలకొందని సభ్యులు ప్రశ్నించారు. గతఏడాది రైతుల వద్ద రూ.700 నుంచి రూ.1000 వరకు కొనుగోలు చేసి సార్టెక్స్‌ మిల్లుల్లో వాటికి అలంకరించి రూ.1600, రూ.1550 చొప్పున వి క్రయించి మిల్లర్లు, దళారులు దోపిడీ చేశారని ఆరోపించారు. దీంతో ఈ విషయంపై ఏవో నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వం కొత్త యాప్‌ను రూపొంచిందని తెలిపారు. పంచాయతీ నిధులు తమ ఖాతాల్లో లేకపోవడంతో విద్యుత్‌ వెలుగులు, పారిశుధ్య కార్య క్రమాలు చేపట్టలే కపోతున్నామని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-24T00:11:18+05:30 IST

Read more