ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-11-30T23:56:52+05:30 IST

ప్రజాస్వామ్యానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి విమ ర్శించారు.

ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం
మాట్లాడుతున్న సంధ్యారాణి

సాలూరు, నవంబరు 30: ప్రజాస్వామ్యానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి విమ ర్శించారు. మోసపూరిత, సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వచ్చేందుకు,ముుఖం చూపించేందుకు భయపడుతున్నారని చెప్పారు. పట్టణంలో బుధవారం సాలూరులో టీడీపీ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ చెల్లికి తల్లికి మేలుచేయని జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు.

ప్రతి ఇంటికి వెళ్లి...

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శు క్రవారం నుంచి టీడీపీ అధ్వర్యంలో ‘ఇదేంఖర్మ ఈ రాష్ట్రానికి’ అనే కార్య క్రమం నిర్వహించనున్నట్లు సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం స్థానిక తహ సీల్దార్‌ కార్యాలయం జంక్షన్‌ నుంచి డీలక్స్‌ సెంటర్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్ర హం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు చెప్పారు. అనంతరం 21, 22 వార్డుల్లో ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. గతంలో నిర్వహించిన ‘బాదుడే... బాదుడు’ కార్యక్రమం తరహాలో ఈ కార్య క్రమం 45నుంచి 50 రోజులు వరకు నిర్వహిం చను న్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అనేక మోసాలు, అన్యాయాలను కరపత్రా లు రూపంలో వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో భాగంగా చంద్రబాబు నాయుడు నియోజక వర్గానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

మూడున్నరేళ్లలో అభివృద్ధి శూన్యం

పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లా డుతూ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్య మన్నారు. రాష్ట్రంలో ప్రధాన పోస్టులన్నీ కడప జిల్లాకే పరిమితం చేశారని ఆరోపించారు. రుషికొండను బోడికొండగా మార్చారని ఎద్దేవాచేశారు. 18 నెలలపాటు జైళ్లో ఉండి వచ్చిన వ్యక్తి పుట్టిన రోజుకు 54 కోట్ల రూపాయలతో వేడుకల నిర్వహించడంపై ప్రశ్నించారు. బాబాయ్‌ హత్యను గుండెపోటుగా మార్చరని ఆరోపించారు. అన్నపై నమ్మకం లేక చెల్లి పక్క రాష్ర్టానికి వెళ్లి న్యాయం కోరుతుందన్నారు. కార్యక్రమంలో సాలూరు పట్టణ, మండల, మక్కువ, పాచిపెంట, మెంటాడకు చెందిన టీడీపీ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, పరమేష్‌, ప్రసాద్‌బాబు, వేణు, వెంకట్రావ్‌, అన్నవరం, ముఖీ సూర్యనారాయణ, ఉమా, పప్పల మోహన్‌రావు, బాలాజీతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:56:53+05:30 IST