హెచ్‌ఎంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-11-16T00:16:19+05:30 IST

కురుకూటి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కృష్ణారావుపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ ప్రయోగమూర్తి చెప్పారు.

హెచ్‌ఎంపై  కేసు నమోదు

సాలూరు రూరల్‌, నవంబరు 15: కురుకూటి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కృష్ణారావుపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ ప్రయోగమూర్తి చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ బాలిక ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 7న టీ గ్లాస్‌తో వెళ్లగా తన పట్ల హెచ్‌ఎం అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొందన్నారు. ఈ విషయమై శాఖపరంగా విచారణ జరిగిందని, ప్రస్తుతం తమకు ఫిర్యాదు రావడంతో పోక్సో నమోదు చేశామని రూరల్‌ ఎస్‌ఐ వెల్లడించారు.

Updated Date - 2022-11-16T00:16:19+05:30 IST

Read more