పీఎం కిసాన్‌కు 39 వేల మంది దూరం

ABN , First Publish Date - 2022-09-09T03:54:21+05:30 IST

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనకు జిల్లాలో 39,207 మంది రైతులు దూరమయ్యే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం సాగు ప్రోత్సాహం కింద రూ.6 వేల సాయం మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పథకం పారదర్శకత, అర్హులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. గత పది విడతలు ఎటువంటి నిబంధనల్లేకుండా సాయమందించిన కేంద్రం...1

పీఎం కిసాన్‌కు 39 వేల మంది దూరం

ఈకేవైసీ చేయించకపోవడమే కారణం
పార్వతీపురం-ఆంధ్రజ్యోతి/సాలూరు రూరల్‌, సెప్టెంబరు 8:
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనకు జిల్లాలో 39,207 మంది రైతులు దూరమయ్యే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం సాగు ప్రోత్సాహం కింద రూ.6 వేల సాయం మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పథకం పారదర్శకత, అర్హులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. గత పది విడతలు ఎటువంటి నిబంధనల్లేకుండా సాయమందించిన కేంద్రం...11 విడత మాత్రం ఈకేవైసీ చేసుకుంటేనే అందించాలని నిర్ణయానికి వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,19,127 మంది రైతులున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 31న కేంద్రం 11 విడత పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద సాయమందించినప్పుడు పలువురు రైతులు ఈకేవైసీ లేక లబ్ధి పొందలేకపోయారు. దీంతో సెప్టెంబరులో అందించే సాయం పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఏడాది జూన్‌ నుంచే పూర్తిచేసుకోవాలని చెప్పింది. కానీ లక్ష్యానికి చేరుకోకపోవడంతో ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటూ వచ్చింది. తుది గడువుగా ఈ నెల 7గా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 79,920 మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. మరో 39,207 మంది చేయించుకోలేదు. అయితే ఇందులో 10 వేల మంది వరకూ రైతులు అనర్హులు ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన 29,207 మంది రైతుల ఈకేవైసీ చేయడానికి వ్యవసాయశాఖ సిబ్బంది ప్రయత్నించగా వారు నాట్‌ ట్రేస్‌డ్‌గా గుర్తించినట్టు వ్యవసాయ శాఖ జేడీ రాబర్ట్‌ పాల్‌ తెలిపారు.


Read more