-
-
Home » Andhra Pradesh » VizagNavy Marathon on 13th of next month-NGTS-AndhraPradesh
-
వచ్చే నెల 13న వైజాగ్-నేవీ మారథాన్
ABN , First Publish Date - 2022-09-10T09:39:35+05:30 IST
నౌకాదళ దినోత్సవం సందర్భంగా వైజాగ్-నేవీ మారథాన్‌ను ఈసారి నవంబరు 13న నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం శుక్రవారం ప్రకటించింది.

ఆన్లైన్లో రిజిస్ర్టేషన్లు ప్రారంభం
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నౌకాదళ దినోత్సవం సందర్భంగా వైజాగ్-నేవీ మారథాన్‌ను ఈసారి నవంబరు 13న నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం శుక్రవారం ప్రకటించింది. తొలుత ఈ మారథాన్‌ను 2014లో నాలుగు వేల మందితో ప్రారంభించగా.. 2019 నాటికి పాల్గొనేవారి సంఖ్య 18 వేలకు పెరిగింది. ఆ తరువాత కరోనా కారణంగా రెండేళ్లు నిర్వహించలేదు. ఈసారి ఏడో ఎడిషన్‌గా భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీ నాలుగు విభాగాల్లో.. 42 కి.మీ., 21 కి.మీ., 10 కి.మీ., 5 కి.మీ. నిర్వహిస్తారు. తొలి పోటీ (42 కిలోమీటర్లు) ఆర్కే బీచ్‌లో విశ్వప్రియ ఫంక్షన్ హాలు వద్ద ప్రారంభమై భీమిలి బీచ్‌రోడ్డులోని ఐఎన్ఎస్ కళింగ వరకు వెళ్లి అక్కడి నుంచి వెనక్కి రావాల్సి ఉంటుంది. ఆ రోజున తెల్లవారుజామున 4.15 గంటలకే పోటీ ప్రారంభమవుతుంది. రెండో పోటీ 5.15 గంటలకు ప్రారంభమవుతుంది. మూడో పోటీ 6.15 గంటలకు ఉంటుంది. నాలుగో పోటీ 6.45 గంటలకు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. డబ్ల్యూడబ్ల్ల్యూడబ్ల్యూ.వైజాగ్‌నేవీమారథాన్.కామ్‌లో పేర్లు నమో దు చేసుకోవాలి. ఈ పోటీలకు రూపొందించిన లోగోలో ఏపీ రాష్ట్ర జంతువుగా గుర్తించిన కృష్ణజింకను ముద్రించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు.