కేసీఆర్‌పై విష్ణువర్ధన్రెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2022-10-07T03:33:20+05:30 IST

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌పై విష్ణువర్ధన్రెడ్డి  ఫైర్

అమరావతి: సీఎం కేసీఆర్‌(KCR)పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి(Vishnuvardhan Reddy) ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుని సీఎం అయిన కేసీఆర్.. తన ప్రధాని ఆశయాల కోసం తెలుగు ప్రజలను వదులుకున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఏపీలో కరెంట్ సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తూ తెలంగాణపై శ్రద్ధ చూపిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ ప్రజల ప్రయోజనాల కోసం ఏపీపై పోరాటాన్ని విరమించుకుంటారా? అని విష్ణువర్ధన్‌రెడ్డి ట్విటర్ వేదికగా నిలదీశారు.

Read more