ఘనంగా యువజనోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-19T01:08:30+05:30 IST

జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో యువజనోత్సవాలు శుక్రవారం ఉల్లాసంగా... ఉత్సాహంగా సాగాయి.

ఘనంగా యువజనోత్సవాలు
యువజనోత్సవాల్లో అవార్డులు అందుకున్న విజేతలు

అనకాపల్లి టౌన్‌, నవంబరు 18: జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో యువజనోత్సవాలు శుక్రవారం ఉల్లాసంగా... ఉత్సాహంగా సాగాయి. సెట్విస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటైన ఈ వేడుకలను తొలుత ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించి తద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సెట్విస్‌ సీఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం కూచిపూడి నృత్యాలు, జానపద పాటలతో డ్యాన్స్‌లు మరింత జోష్‌ పుట్టించాయి. ముఖ్యంగా దివ్యాంగులు, బధిరుల నృత్యాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విష్ణుమూర్తి డీఎస్‌డీవో నగిరెడ్డి సూర్యారావు, డీపీఆర్‌వో సాయిబాబా, వివిధ పాఠశాలల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతల వివరాలు

ఆనందోత్సాహాల నడుమ జరిగిన యువజనోత్సవాల్లో గెలుపొందిన వారి వివరాలివి. కూచిపూడిలో ఎం.జాహ్నవి, హిమజ, దివ్య ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. భరతనాట్యంలో ఎన్‌.ప్రశాంతి ప్రథమ, జానపద నృత్యంలో సింధూ గ్రూపు, నవ్య గ్రూపు, సౌమ్య గ్రూపులు వరుస మూడు స్థానాల్లో నిలిచారు. జానపద నృత్యంలో లక్ష్మి గ్రూపు ప్రథమ బహుమతి సాధించారు. హార్మోనియంలో వడ్డాది ప్రసాద్‌, మిమిక్రీలో డి.గణేశ్వరరావు ప్రథమ బహుమతులను సొంతం చేసుకున్నారు. వక్తృత్వ పోటీల్లో పి.అనూరాధ, కె.శ్రీనివాస్‌, కె.తేజస్విని వరుస మూడు స్థానాల్లో నిలిచారు. ఆధునిక గీతం విభాగంలో లక్షిత, ధనలక్ష్మి, సీహెచ్‌.మల్లేశ్వరి, ఆధునిక నృత్యంలో పి.కేశవ్‌, బి.జగత్‌, బి.శ్రీదేవి, క్విజ్‌లో చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. పెయింటింగ్‌లో జి.కొండబాబు, కె.మధుబాబు, జి.గణేష్‌, గ్రూప్‌ డిస్కషన్‌లో డీవీఎన్‌ కళాశాల అనకాపల్లి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సీపట్నం, ఫ్యాన్సీ డ్రెస్‌ విభాగంలో సీహెచ్‌.కుసుమప్రియ, వై.ప్రణవి బహుమతులను సొంతం చేసుకున్నారు. వీరికి అతిథులు మెమొంటో, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొరని సెట్విస్‌ సీఈవో నాగేశ్వరరావు వివరించారు.

Updated Date - 2022-11-19T01:08:32+05:30 IST