ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-03T06:13:38+05:30 IST

గాజువాక కుంచమాంబ కాలనీలో ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
మృతుడు మణికంఠ (ఫైల్‌ ఫొటో)

గాజువాక, అక్టోబరు 2: గాజువాక  కుంచమాంబ కాలనీలో ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుంచమాంబ కాలనీకి చెందిన జి.మణికంఠ (27) ఓ ప్రైవేట్‌ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తమ్ముడు రవి ఎంతసేపు తలుపు కొట్టినా తెరవకపోవడంతో స్థానికుల సహాయంతో బలవంతంగా తలుపుతు తెరిచాడు. అయితే అప్పటికే మణికంఠ ఉరి వేసుకుని కనిపించడంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి జేబులో వున్న సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారకులు కాదని మృతుడు నోట్‌లో పేర్కొన్నాడు. మణికంఠకు వివాహ సంబంధాలు చూస్తున్నామని, అయితే ఎక్కడా సెట్‌ కాలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more