మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-27T07:09:04+05:30 IST

ప్రేమించానని మూడేళ్లుగా నమ్మించి, ఇప్పుడు పెళ్లి చేసుకోనని ప్రియుడు ముఖం చాటేయడంతో ఓ యువతి మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మనస్తాపంతో యువతి ఆత్మహత్య
గౌరి మృతదేహం

సీతంపేట, సెప్టెంబరు 26: ప్రేమించానని  మూడేళ్లుగా నమ్మించి, ఇప్పుడు పెళ్లి చేసుకోనని ప్రియుడు ముఖం చాటేయడంతో ఓ యువతి మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొండపర్తి పులివారి వీధిలో నివాసం ఉంటున్న శంకరపు మజ్జిగౌరి(26) నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. గతంలో అమూల్య ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేటప్పడు అదే ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీమల విశ్వేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకోమని గౌరి అడగడంతో విశ్వేశ్వరరావు ముఖం చాటేశాడు. ఆమె తనకు న్యాయం చేయాలని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దిశ పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయిన్పప్పటికీ విశ్వేశ్వరరావు పెళ్లికి అంగీకరించ లేదు. మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఉదయం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన మృతురాలి సోదరుడు నాగరాజు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించి 100కి ఫోను చేసి సమాచారం అందించారు. నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రమీల కేసు దర్యాప్తు చేపట్టారు.


Read more